Dhoni remained unbeaten at 87 runs and had the company of Kedar Jadhav, who also scored a half-century and remained unbeaten at 61.match highlights..
#IndiavsAustralia3rdODImatchhighlights
#viratkohli
#msdhoni
#kuldeepyadav
#dineshkarthik
#rohithsharma
#Melbourne

ఆస్ట్రేలియాలో మూడో వన్డే గెలవడం ద్వారా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా టెస్ట్, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరో వన్డే గెలిచింది. ఇప్పుడు మూడో వన్డే భారత్ గెలవడం ద్వారా సిరీస్ సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్ అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 234/3తో అలవోకగా ఛేదించేసింది. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన సగర్వంగా కంగారూల గడ్డపై పర్యటనని ముగించింది. ఈ సిరీస్‌కి ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.